ఎవరికి ఏది ఎంత ప్రాప్తం అని దైవం నిర్ణయిస్తే...

శనివారం, 9 ఏప్రియల్ 2022 (21:36 IST)
దైవేన ప్రభుణా స్వయం జగతి య ద్యస్య ప్రమాణీకృతం
తత్త స్యోపనమే న్మనా గపి మహాన్నైవా శ్రయః కారణమ్
సర్వాశాపరిపూరకే జలధరే వర్ష త్యపి ప్రత్యహం
సూక్ష్మ ఏవ పతన్తి చాతకముఖే ద్విత్రాః పయోబిన్దవః

 
ఎవరికి ఏది ఎంత ప్రాప్తం అని దైవం నిర్ణయిస్తే, అది వారికి దానంతట అదే లభిస్తుంది. దీనికోసం ఎవరినీ యాచించనక్కర్లేదు. ఆశ్రయించనవసరంలేదు. అన్నివైపులా దట్టంగా వ్యాపించిన మేఘాలు నిరంతరం వర్షిస్తున్నా నోరు తెరుచుకుని కూర్చున్న చాతక పక్షి నోట్లో కొద్దిగైనా రెండు మూడు చుక్కలు రాలకపోవు కదా. అన్నిటికీ ఆ దైవం ఎంత రాసిపెట్టి వుంటే, అంత తప్పక అందుతుంది.

 
ఎవ్వనికి నిజ్జగంబున నెంతఫలము
దైవకృత మగునది వొందు దప్ప కతని
గారణము గాదు పెనుబ్రావు ఘనుని జేరు
చాతకము వాతబడు సల్ప జలకణములు

 
మనం మహా ఉదారుని ఆశ్రించినా, మనకు ఎంత ప్రాప్తమని రాసివుంటే అంతే దక్కుతుంది. కనుక దైవకృప విస్తారంగా పొందడానికి ప్రయత్నం చేయాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు