కుబేర విగ్రహాన్ని ఇంట్లో వుంచితే...?

శుక్రవారం, 31 మే 2019 (21:33 IST)
మన నిత్య జీవనానికి ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని అందరికి ఉంటుంది. మరి ఆ తల్లి అనుగ్రహం కొంతమంది మాత్రమే ఎందుకు ఉంటుంది? అసలు మహాలక్ష్మీ దేవత అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?
 
చాలామంది రకరకాలుగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయని భావిస్తారు. అయితే కొన్ని విధాలుగా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట. కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ప్రపంచంలోని అన్ని సంపదలు కుబేరుని ఆధీనంలో ఉంటాయి. ముఖ్యంగా కుబేరుడు ఉండే స్థానంలో పరిశుభ్రతను పాటించాలి.
 
అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. లక్ష్మీదేవి సముద్రమధనంలో ఆవిర్బవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమెను నీటికి సంబందించిన శంఖం, తామరపువ్వులతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
 
తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసినా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించినా శుభప్రదమే. ఉసిరికాయ అంటే మహాలక్ష్మీకి ఎంతో ఇష్టమట. శుక్రవారం సాయంత్రం ఒక్కరోజు లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే మహాలక్ష్మీ అనుగ్రహం పొంది ఆర్దిక బాదలు తొలగిపోయి అప్పులు పూర్తిగా తీర్చుకుంటారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆ తల్లికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది.
 
ఉసిరికాయ గుజ్జును శ్రీ మహాలక్ష్మీ దేవికి నైవేద్యంగా పెట్టి తరువాత ఆ గుజ్జును ముత్తైదువులకు ఇవ్వాలి. అమ్మవారికి ఇష్టమైన ఉసిరికాయను ప్రసాదంగా పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు