శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

సెల్వి

సోమవారం, 25 నవంబరు 2024 (13:46 IST)
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సన్నాహక పరిశుభ్రత కార్యక్రమం నవంబర్ 26న నిర్వహించనున్నారు. నవంబర్ 28 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా తిరుచానూరు ఆలయంలో అజిత్ సేవను టీటీడీ రద్దు చేసింది. 
 
కార్తీక బ్రహ్మోత్సవం, వాహన సేవల షెడ్యూల్
నవంబర్ 28న ధ్వజారోహణం, చిన్న శేషవాహన సేవ
నవంబర్ 29న పెద్దశేష వాహనం, హంస వాహనం
నవంబర్ 30న ముత్యపు పందిరి, సింహవాహనం
డిసెంబర్ 1న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం
డిసెంబర్ 2న పల్లకీ వాహనం, గజ వాహనం
డిసెంబర్ 3న సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడ వాహనం
డిసెంబర్ 4న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం,
డిసెంబర్ 5న రథోత్సవం, అశ్వ వాహనం, 
డిసెంబర్ 6న పల్లకీ ఉత్సవం, డిసెంబర్ 7న పుష్పయాగం జరుగుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు