ఆంజనేయుడిని ఏ పూలతో పూజించాలి? ఇష్టమైన పుష్పాలు ఏమిటి?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (15:35 IST)
హనుమంతుడికి తమలపాకులతో పూజలు చేయడం మనకు తెలిసిన విషయమే. అలాగే ఇష్టమైన పుష్పాలు ఏమిటో తెలుసుకుందాం. హనుమంతునికి పొన్నపువ్వు, మొగలి, పొగడ, నందివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, మెట్ట తామర, పొద్దు తిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం.
 
అలాగే మంకెన, బండికెరివెంద, అడవిమల్లె, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం వంటి పుష్పాలతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. 
 
ఇంకా పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఇష్టం. ఈ పుష్పాలతో స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

వెబ్దునియా పై చదవండి