మితభాషిగా వున్నవాడు అనుకున్నది సాధిస్తాడు

బుధవారం, 10 నవంబరు 2021 (23:25 IST)
ఇతరుల తప్పిదాలు అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకూడదు. దాని వల్ల ఉపయోగమేమీ లేదు. ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు. ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
 
దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే. కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
 
మన సంభాషణ యందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి. దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచుకొనవలనంటే ఆయన మహిమను, నామాన్ని స్మరించడం అవసరం. కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు