విష్ణు సహస్ర నామము భగవద్గీతకు తర్వాత ముఖ్యమైనది. ఇది సకల పాపాల నుంచి, దురాలోచనల నుంచి, చావుపుట్టుకల నుంచి తప్పిస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణతో భయాందోళనలు తొలగిపోతాయని భీష్మాచార్యుడు నమ్మేవారు. అలాంటి విష్ణు సహస్ర నామాన్ని ప్రతిరోజూ పఠించేవారు లేదా వినేవారికి లక్ష్య సాధన సులువవుతుంది.
అంతేగాకుండా దారిద్ర్య బాధలను విష్ణు సహస్ర నామ పారాయణ తొలగిస్తుంది. అదృష్టాన్నిస్తుంది. సమస్త దోషాలను తొలగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధినిస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణతో ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతికూలతలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫలితంగా జీవితంలో లక్ష్య సాధనకు మార్గం సుగుమమవుతుంది.