స్నపన తిరుమంజనం.. కిరీటాలు, మాలలు.. పట్టువ్రస్తాలు.. సుందరంగా అలంకరణ

గురువారం, 29 సెప్టెంబరు 2022 (20:11 IST)
Flowers
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి.  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయ్యప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. 
 
ఆలయంలోని రంగనాయకుల మండపంలో వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేస్తారు. దీనిలో భాగంగా రంగనాయకుల మండపాన్ని ఫలపుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ అంలకరణల్లో శ్రీవారు భక్తులను కనువిందు చేశారు.
 
ఇందులో భాగంగా అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్న తిరుమలేశుడికి ప్రకృతి దాసోహమైంది. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన ఫలపుష్పాలనే కాకుండా దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు అర్చకస్వాములు. 
 
ఈసారి స్నపన తిరుమంజన సేవల్లో పవిత్రాలు, సజ్జ కంకులతో తయారు చేయించిన కిరీటాలు, మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంకా యాలకులు, పట్టువ్రస్తాలు, సజ్జ కంకులు, పవిత్రాలు, ఎండు ద్రాక్ష-రోస్‌ పెటల్స్, వట్టివేర్లు-ముత్యాలు, నల్ల-తెల్లద్రాక్ష, కురువేరు-పసుపు, ఎరుపు పెటల్స్, మల్లె-రోజా మొగ్గలతో స్వామివారికి వివిధ రకాలుగా కిరీటాలు, మాలలు తయారు చేయించి, స్వామివారి తిరుమంజన సేవలో అలంకరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు