సోమవారం నుంచి శుక్రవారం వరకు రావిచెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుందట. శనివారం లేదా ఆదివారం రావిచెట్టును తాకితే అదృష్టమని పండితులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన కథ ప్రచారంలో ఉంది. పాల సముద్రం వలికిన సమయంలో లక్ష్మి దేవిని పెళ్లి చేసుకునేందుకు మహావిష్ణువు సిద్ధమవుతాడు. కానీ ఆమె కంటే అక్క జ్యేష్ఠ లక్ష్మి పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోనని చెప్తుంది.
దీనిపై ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెళ్తుంది. ముని చాలా పవిత్రంగా రోజు పూజలు, హోమాలతో శుచిగా వుండటంతో విసిగిపోయి.. జ్యేష్ఠ లక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది. దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలిపెడతాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండటం ఇష్టంలేక నన్ను ఇక్కడికి నుండి ఎక్కడికైనా పంపించమని విష్ణు మూర్తిని ప్రాధేయపడుతుంది. దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడ దొరకదు అని చెబుతాడు.