నాసిక్‌లోని కాళరామ్ మందిరం

నాసిక్‌లోని ముఖ్యమైన ఆకర్షణీయ ప్రాంతాల్లో కాళ రామ్ మందిరం ఒకటి. ఇది నగరంలోని పంచవటి ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఆలయాల లోనూ బాగా పేరున్న, సాధారణమైన ఆలయంగా దీనికి గుర్తింపు వచ్చింది. పీష్వా సర్దార్ ఒధేకర్ 1790లో దీనిని నిర్మించారు. ఈ ఆలయం శ్రీరామచంద్రుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో శ్రీరాముడు సతీ సమేతంగా నల్లటి విగ్రహ రూపంలో సాక్షాత్కరిస్తాడు. ఈ విగ్రహం నల్లటి రూపంలో ఉంటుంది కాబట్టే ఆలయం కూడా కాళ రామ్ ఆలయంగా పేరొందింది. (అంటే నల్ల రాముడి ఆలయం అని అర్థం).

ఈ ఆలయంలో శ్రీరాముడికి ఇరువైపుల సీతా మాత మరియు లక్ష్మణుడు కొలువై ఉన్నారు. వీరి విగ్రహాలు కూడా నల్లటి రంగులో సకలాభరణాలతో కూడి ఉంటాయి. ఈ ఆలయం మొత్తంగా నల్లరాతితో నిర్మించబడింది. దీనికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ నాలుగు నాలుగు దిక్కులలో ఉన్నాయి. గోపుల మొత్తం 32 టన్నుల బంగారంతో తాపడం చేయబడింది. గతంలో హరిజనులకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. డాక్టర్ అంబేద్కర్ ఇందుకు నిరసనగా సత్యాగ్రహం
WD PhotoWD
చేసిన తర్వాత 1930లో హరిజనులకు ఆలయ ప్రవేశానికి అనుమతి లభించింది.

కాళ రామ్ మందిర భవనం చుట్టూ మహా కుడ్యం నిర్మించారు. ఈ గోడలను 96 స్తంభాలతో చూపరులను అబ్బుర పరిచేలా కట్టారు. తూర్పువైపునుంచి ఆలయం లోకి ప్రవేశంచవలసి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన రాళ్లను రామ్‌షెజ్ నుంచి తెచ్చారు. ఈ ఆలయ నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.23 లక్షలను వెచ్చించారు. దాదాపు 2000 మంది కూలీలు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. నిర్మాణం పూర్తవడానికి 12 సంవత్సరాలు పట్టింది. కాళరామ్ ఆలయం ఎత్తు 70 అడుగుల మేరకు ఉంటుంది. బంగారంతో తాపడం చేసిన గోపురం దీనికి అమర్చారు. గర్భగుడికి దగ్గరగా సీతామాత గుహ కూడా ఉంది.

WD PhotoWD
సీతామాత తన ప్రవాస జీవితంలో ఈ గుహలోనే బసచేసిందని భక్తుల విశ్వాసం. ఈ గుహ చుట్టూ అతి పెద్ద మర్రి చెట్లు ఊడలు దిగి ఉంటాయి. ఈ ఆలయం చూడ్డానికి త్రయంబకేశ్వరాలయంలా ఉంటుందని చెబుతారు. అంతేకాక దీనికి వితాల, గణేశ, హనుమాన్ దేవుళ్లను ప్రతిష్టించిన ఆలయాలు అనుబంధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో రామనవమి, దసరా, చైత్ర పాఢ్యమి (హిందూ నూతన సంవత్సరాది) పండుగలను పైభవంగా జరుపుతారు. ఈ సమయంలో కాళరామ్ మందిరం శ్రీరాముడి సందర్శనాభాగ్యానికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

విశిష్ట పండుగలు:
శ్రీరామనవమి, దసరా, చైత్ర పాఢ్యమి పర్వదినాలలో ఈ ఆలయంలో పెద్ద ఊరేగింపు, ఉత్సవాలు జరుపుతారు.

గమ్యమార్గం:
ముంబైకి 170 కిలోమీటర్ల దూరంలోను, పుణేకి 210 కిలోమీటర్ల దూరంలోనూ నాసిక్ ఉంటుంది.
సెంట్రల్ రైల్వే మార్గంలో నాసిక్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్.
నాసిక్‌లో విమానాశ్రయం ఉంది. ఇది ముంబైతో అనుసంధానమై ఉంది.