అయ్యప్పస్వామి దేవాలయంలో దళిత పూజారులు..

శనివారం, 7 అక్టోబరు 2017 (10:53 IST)
కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ) ఆధ్వర్యంలోని దేవాలయాల్లో దళిత పూజారులు నియమతులు కాబోతున్నారు. 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించాలని కేరళ దేవస్వోమ్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిఫారసు చేసింది. వీరిలో ఆరుగురు దళితులు ఉన్నారు.

పూజారులుగా దళితులను నియమించాలని సిఫారసు చేయడం ఇదే తొలిసారి. పార్ట్ టైమ్ పూజారుల నియామకం కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించినట్లు బోర్డు ప్రకటించింది. 
 
దేవస్వోమ్ మంత్రి కడకంపల్లి రామచంద్రన్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికలో అవినీతికి తావుండరాదని, రిజర్వేషన్ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా నియామకాలు జరగాలని చెప్పారు. మొత్తం 62 మంది పూజారుల నియామకానికి బోర్డు సిఫారసు చేసింది. వీరిలో 26 మంది అగ్రకులస్థులు ఉన్నారు. బోర్డు ఆధ్వర్యంలో 1,248 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అయ్యప్పస్వామి దేవాలయం కూడా ఒకటి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు