అయోధ్యలోని రామమందిరంలో సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ చేసిన రామ్ లల్లా విగ్రహానికి సూరత్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.11 కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని విరాళంగా అందించారు. సూరత్‌లోని గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని అయిన ముఖేష్ పటేల్ తన కుటుంబంతో కలిసి అయోధ్యను సందర్శించి, వజ్రం, బంగారం, ఇతర రత్నాలతో అలంకరించబడి, నాలుగున్నర కిలోల బరువున్న కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు సమర్పించారు.
ఆలయ ప్రధాన అర్చకులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ధర్మకర్తల సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో పటేల్ కిరీటాన్ని అందజేశారు. కిరీటం కోసం రామ్ లల్లా విగ్రహం తలను కొలిచేందుకు సూరత్ సంస్థకు చెందిన ఉద్యోగులను జనవరి 5న విమానంలో అయోధ్యకు పంపించి కిరీటాన్ని సిద్ధం చేసినట్లు విశ్వహిందూ పరిషత్ జాతీయ కోశాధికారి దినేష్ నవాడియా తెలిపారు.