ఏప్రిల్ 17న రామనవమి రోజున అయోధ్యలో సూర్య కిరణాలు అతని నుదుటిపై పడినప్పుడు రామ్ లల్లాకు 'సూర్య అభిషేకం' జరుగనుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భారీగా భక్తులు కదలి వస్తున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్-బెంగళూరు శాస్త్రవేత్తల సహకారంతో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) నిపుణులు ఇప్పటికే అయోధ్యలో క్యాంపింగ్‌లో ఉన్నారు.
సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపై తదుపరి నాలుగు నిమిషాల పాటు 75 మిల్లీమీటర్ల వరకు వృత్తాకారంలో ప్రకాశిస్తాయి. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రక్రియను ప్రారంభించడం రామ మందిర ట్రస్ట్ ప్రణాళికలో వుంది. సాధువులు, జ్ఞానుల అభ్యర్థనలను అనుసరించి, కొత్తగా నిర్మించిన ఆలయంలో మొదటి రామ నవమి రోజున 'సూర్య అభిషేక' ఏర్పాట్లు చేయడానికి సీబీఆర్ఐ నుండి శాస్త్రవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.