రోజుకు 25 వేల టికెట్ల చొప్పున నెల రోజుల కోటా అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం తర్వాత తిరుమలతో పాటు తిరుపతిలోని టీటీడీ అద్దె గదుల కోటాను రిలీజ్ చేయనుంది. భక్తులు విషయాన్ని గమనించి వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో భక్తులు తప్పనిసరిగా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
మరోవైపు, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు లభించినట్టు టీటీడీ ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న 50,476 మంది భక్తులు సమర్పించిన కానుకలతో పాటు నిల్వ ఉన్న నాణేలను కూడా గురువారం లెక్కించగా రూ.5.21 కోట్ల ఆదాయం లభించింది.