తిరుమల శ్రీనివాసునికి ఘనంగా జ్యేష్టాభిషేకం

శుక్రవారం, 17 జూన్ 2016 (12:00 IST)
ఏడు కొండల్లో కొలువైవున్న తిరుమల శ్రీనివాసుని జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ విగ్రహాలైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి కవచాల సందర్భంగా ఈ ఉత్సవాన్ని తితిదే ప్రతి యేటా నిర్వహిస్తోంది. ఏడాది పొడవునా జరుగుతున్న ఉత్సవాలలో శ్రీవారికి వార్షికోత్సవాలు, వారోత్సవాలు, నిత్యోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. 
 
ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు పాడవకుండా యేడాదికి ఒకసారి శ్రీవారు ధరించిన కవచాలు తీసేస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం, అభిషేకాలు నిర్వహిస్తారు. రెండవరోజు స్వామివారికి వజ్రకవచం ధరింపజేస్తారు. 
 
మూడవరోజు మళ్ళీ వజ్రకవచం తీసి వేసి స్వర్ణకవచం ధరింపజేయనున్నారు. మళ్ళీ జ్యేష్టాభిషేకం వచ్చేంత వరకు ఈ స్వర్ణకవచంలోనే భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య జ్యేష్టాభిషేకం జరిగింది.

వెబ్దునియా పై చదవండి