ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 2,432 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 224 కేసులు నమోదయ్యాయి. వీటిలో తిరుపతిలోనే 135 కేసులు వచ్చాయి.
ఇదిలావుంటే, శ్రీవారి హుండీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. లాక్డౌన్ తర్వాత పరిమితంగా భక్తులకు దర్శనాలను అనుమతిస్తున్న వేళ, తిరుమలలో బుధవారం రద్దీ పెరిగింది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న వారు కూడా కరోనా భయంతో స్వామి దర్శనానికి వచ్చేందుకు సుముఖంగా లేరనే వార్తలు వచ్చాయి.
కానీ, బుధవారం ఏకంగా 8,068 భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. మొత్తం 2,730 మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు. లాక్డౌన్ అనంతరం దర్శనాలను పునరుద్ధరించిన తర్వాత రూ.32 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని తితిదే అధికారులు వివరించారు.