తిరుమల శ్రీవారి నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..

ఠాగూర్

మంగళవారం, 20 ఆగస్టు 2024 (10:20 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగే నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ సోమవారం విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబరు 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభం అవుతాయని తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకూ, సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకూ వాహన సేవలు నిర్వహిస్తారు.
 
వాహన సేవల వివరాలు ఇలా... 
4-10-2024 - సాయంత్రం 5.45 గంటల నుండి 6 గంటల వరకూ ధ్వజాహోరణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం
5-10.2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేషవాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
6-10.2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.
7-10.2024 - ఉదయం 8 గంటలకు కల్ప వృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం.
8-10.2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకూ గరుడ వాహనం.
9-10.2024 - ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్ర 4 గంటల నుండి స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం
10-10.2024 - ఉదయం 8 గంటలకు సూర్య ప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.
11-10.2024 - ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం. 
12-10.2024 - ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకూ చక్ర స్నానం, రాత్రి 8.30 గంటల నుండి 10.30 గంటల వరకూ ద్వాజావరోహణం 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు