2009లో కుప్పకూలిన దేశీయ ఆర్థిక వ్యవస్థ

శనివారం, 26 డిశెంబరు 2009 (20:24 IST)
FILE
2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైన అమెరికాలో హౌసింగ్, ప్రాపర్టీ లోన్ రికవరీలో ఎదురుదెబ్బ తగలడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంది. 1930లో ఏర్పడ్డ మాంద్యంకన్నా 2008లో తలెత్తిన మాంద్యం చాలా ఎక్కువని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.

2008లో జరిగిన తప్పిదం కారణంగా తలెత్తిన ఆర్థిక పరిస్థితులు తారుమారైనాయి. కాబట్టి వచ్చే 2009లో ఆర్థిక స్థితిగతులు మరింత దిగజారుతాయని ఈ ఏడాది ప్రారంభంలోనే ఆర్థిక నిపుణులు సూచించారు. ఆర్థిక నిపుణులు సూచించిన మేరకే ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రతి రోజు లక్షలమంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారిన విషయం విదితమే.

ఆర్థిక మాంద్యం కారణంగచాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో పలు కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలలో కోత విధించడం, మరికొన్ని కంపెనీలు ఇంక్రిమెంట్లు లేకుండానే ఉద్యోగుల నుంచి పనులు చేయించుకోవడం విశేషం. కాని 2009 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో కాస్త మార్పు సంతరించుకుంది. దీంతో రికవరీలు ప్రారంభమై మాంద్యం నుంచి బయటపడినట్టైంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో తలెత్తిన పరిణామాలతో పలు కంపెనీల ఆర్థికస్థితి కాస్త మెరుగైందని భావించాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగానున్న కంపెనీలలో ఉద్యోగులను నియమించే దిశలో కాస్త సఫలమైందనే చెప్పాలి. 2008లో ఆర్థిక మాంద్యం తలెత్తడంతో అమెరికా, యూరోప్ దేశాలలో పెద్ద-పెద్ద ఆర్థిక సంస్థలు, పలు బ్యాంకులు మూతపడ్డ విషయం విదితమే.

కాని ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం బారిన పడకుండా తప్పించుకున్న దేశాలు మాత్రం జర్మనీ, చైనా, భారత్. ఈ మూడు దేశాలలో మాంద్యం ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగానున్న ఆర్థిక మాంద్యం కారణంగా ఈ మూడు దేశాల్లోను మాంద్యం దెబ్బ తగులుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. కాని వారి ఆలోచనలకు విరుద్ధంగా మాంద్యం నుంచి బయటపడేందుకు ఈ మూడు దేశాలు ప్రయత్నించడం గమనార్హం.

FILE
2009లో దేశీయ ఆర్థిక వ్యవస్థ- 2007-08లో ఆర్థికవృద్ధి 9.8 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ కాస్త చతికిలపడింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక వృద్ధి పెరిగిన తర్వాత 2009లో మాత్రం ఛాలెంజ్‌గా మారిందని ఆర్థిక నిపుణులు తెలిపారు.

ఈ ఏడాది చివరి నాటికి ఆర్థిక వృద్ధి 7 శాతానికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోవుంచేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మాంద్యంలోను ఇదే పరిస్థితి కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 9 నుంచి 10 శాతానికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాతావరణం- ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు సరైన సమయంలో కురవలేదు. ఈ కారణంగా పంటలు చేతికి అందలేదు. ఆ తర్వాత వర్షాలు కురిసినా అప్పటికే వర్షాకాలం ముగిసింది. కాని కురిసిన వర్షం కూడా పంటలకుపయోగపడలేదు. అదే నిరుడు చెరకుపంట చేతికందకపోవడంతో ఈ ఏడాది చక్కెర ధరలు ఆకాశాన్నంటాయి. అదే ఈ ఏడాది సజ్జలు, బియ్యం, జొన్నల పంటల ఉత్పత్తుల్లో తగ్గుదల కనపడింది. అనుకూల వాతావరణం లేకపోవడంతో పంటల దిగుబడి చాలా తగ్గిందనే చెప్పాలి.
FILE


2010లో దేశీయ ఆర్థిక వ్యవస్థ- 2009లో ఉత్పత్తులు, నిర్మాణ రంగాలు(మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్‌ట్రక్షన్)రంగాలలో ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొనివుంది. ఈ రంగాలలో వార్షిక ఆర్థిక వృద్ధి 9 శాతానికి చేరుకుంది. కాని ప్రస్తుత ఏడాదిలో వ్యవసాయ రంగంలో ఆశించినంతగా పంటల దిగుబడులు జరగలేదు.

వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా వేగవంతంగా వృద్ధి జరగనుంది. మాంద్యంతో తలెత్తిన పరిణామాలతో నేర్చుకున్న గుణపాఠాలతో 2010లో మంచి పరిణామాలు కొనసాగగలవని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీ స్థాయిలో ఆర్థిక రంగం పుంజుకోనుండటంతో భారతదేశంలో 2010లో వడ్డీ రేట్లు పెరిగే సూచనలున్నాయి. రూపాయి విలువ మరింత పటిష్టమవ్వడంతో ప్రపంచవ్యాప్తంగానున్న దేశాలలో డబ్బును కూడబెట్టే దేశంగా నిలుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు.

వెబ్దునియా పై చదవండి