మంత్రాలకు ...రాలవయ్యా బాబూ!

గురువారం, 11 సెప్టెంబరు 2008 (16:29 IST)
FileFILE
వార్త : మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు అత్యంత సన్నిహితుడైన వివాదాస్పద తాంత్రిక వేత్త చంద్రస్వామి బుధవారం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో ఆయన నివాసంలో సమావేశమై దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

చెవాకు : అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ఎత్తుగడలు మంచిదే. కానీ ఈ భేటీ మీకెంతవరకు సహాయ పడుతుందో అర్థం కాలేదు. లెక్క లేకుండా ఏ పనీ చేయని మీరు చంద్రస్వామికి అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు.

నందమూరి వారసులతో భేటీ అయ్యారు బాగానే ఉంది. ప్రచారంలో వారు మీకు సహాయ పడగలరని అనుకోవచ్చు. కానీ పీవీకే చివరి రోజుల్లో పెద్దగా మేలు చేయని ఈ చంద్రస్వామి మీకెలా మేలు చేస్తారో కాస్త చెప్పరూ.

ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన ద్వారా మీకు సరికొత్త సమస్యలు రాకుంటే మంచిది. ఎవరూ ఆదరించలేని స్థితిలో మీరు ఆయనను ఆదరించాలనుకుంటే ఫరవాలేదు కానీ మంత్రాలకు మామిడికాయలు రాలతాయనే నమ్మకం మీకు లేకుంటే సరి.

వెబ్దునియా పై చదవండి