వార్తః గత పర్యాయం తృటిలో విజయావకాశం చేజార్చుకున్న ముషీరాబాద్ మినహా ఉపఎన్నికలు జరిగే మరెక్కడా పోటీ చేయరాదని బీజేపీ రాష్ట్రనేతలు అధిష్ఠానానికి నివేదించారు.
చెవాకుః అసలు బలం తెలుసుకునే బరిలో దిగుతున్నారన్న మాట. ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నప్పటికీ, ఆ క్రెడిట్ మొత్తం తెరాసకే దక్కగలదని ఓ నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు కాబోలు. మరి ముషీరాబాద్‌లో గత పర్యాయం టీడీపీ మద్దతుతో పోటీ చేసిన విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది. ఈ దఫా ఆ పార్టీ వేరుగా పోటీ చేస్తున్నందున మీకు డిపాజిట్ ఖాయంగా తిరిగి లభిస్తుందని విశ్వసిస్తున్నారా? బాగా ఆలోచించుకుని బరిలో దిగితే మంచిది.