ఆర్‌బీఐ పాలసీ రివ్యూ ప్రకటించనున్న నేపథ్యంలో బ్యాంకిగ్ షేర్లు ర్యాలీ అవుతున్నాయి. ఫలితంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 36వేల మార్కును అధిగమించింది. సెన్సెక్స్ ప్రస్తుతం 356 పాయింట్ల లాభంతో 50986 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 14990 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి.