పారిస్ పారాలింపిక్స్ పోటీలు : పతకాల పండిస్తున్న భారత అథ్లెట్లు

ఠాగూర్

గురువారం, 5 సెప్టెంబరు 2024 (09:48 IST)
పారిస్ వేదికగా పారాలింపిక్స్ పోటీలు సాఫీగా సాగిపోతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్నారు. అలాగే, పతకాల పండి పండిస్తున్నారు. తాజాగా పురుషుల వ్యక్తిగత రిక్వర్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్ హర్వీందర్ సింగ్ ఏకంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్ పోలాండ్‌కు చెందిన లుకార్జ్ సిజెకన్ను 6-0తో చిత్తు చేశాడు. దీంతో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు.
 
అటు ఒలింపిక్స్‌లోనూ ఇప్పటివరకూ భారత్‌కు ఆర్చరీలో బంగారు పతకం రాలేదు. కాగా, 33 ఏళ్ల హర్వీందర్ మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా ఆర్చరీలో పతకం సాధించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు.
 
ఇక టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ 19 పతకాలు సాధించింది. దాంతో ఈసారి 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిం. దానికి తగ్గట్టుగానే భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ఖాతాలో 24 పతకాలు చేరాయి. మరో పతకం సాధిస్తే టార్గెట్‌ను అందుకుంటుంది. ఇందులో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా పతకాల పట్టికలో భారత్ 13వ స్థానంలో కొనసాగుతోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు