టాప్ 20లో సానియా : భూపతి ధీమా

బుధవారం, 11 జులై 2007 (09:46 IST)
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లోకి చేరుకుంటుందని డబుల్స్ స్పెషల్ ఆటగాడు మహేశ్ భూపతి ధీమా వ్యక్తంచేశాడు. సెప్టెంబర్ 17 నుంచి 23వ తేది వరకు కోల్‌కతాలో నిర్వహించనున్న సన్‌ఫీస్ట్ ఓపెన్-2007ను ప్రమోట్ చేయడానికి వచ్చిన మహేశ్ భూపతి మాట్లాడుతూ ఈ మేరకు ఆశాభావం వెలిబుచ్చారు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియాతో జోడీగా సుదీర్ఘకాలం ఆడగలనన్నారు. అంతేకాకుండా తొలిసారిగా సానియా జట్టుకట్టిన గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్‌ను గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఒలింపిక్స్‌ డబుల్స్‌లో లియాండర్ పేస్‌తో బరిలోకి దిగే విషయాన్ని భారత టెన్నిస్ సమాఖ్య నిర్ణయింస్తుందని మహేశ్ భూపతి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి