భారత బాక్సర్ నిషాంత్ దేవ్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో ఓటమి తప్పలేదు. పురుషుల 71 కిలోల విభాగంలో శనివారం రాత్రి జరిగిన క్వార్టర్స్ బౌట్‌లో నిషాంత్ 1-4తో మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే చేతిలో పోరాడి ఓడాడు. ఆరంభంలోనే దూకుడుగా పంచ్‌లు విసిరిన నిషాంత్ తొలి రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకొన్నాడు. అయితే, రెండో రౌండ్‌లో ఎదురుదాడి చేసిన వెర్డే 3-2తో నెగ్గాడు.