Paris Olympics 2024: ప్రమాదంలో చిక్కుకున్న భారత గోల్ఫర్ దీక్షా.. ఏమైంది?

సెల్వి

శుక్రవారం, 2 ఆగస్టు 2024 (14:10 IST)
Diksha Dagar
భారత గోల్ఫ్ క్రీడాకారిణి దీక్షా దాగర్, ఆమె కుటుంబం పారిస్‌లో ప్రమాదానికి గురైంది. అయితే గోల్ఫ్ క్రీడాకారిణి దీక్షా ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. అయితే దీక్షా తల్లి వెన్నెముకకు గాయంతో ఆసుపత్రి పాలైంది. భారత గోల్ఫర్ ఈవెంట్ ఆగస్ట్ 7న ప్రారంభమవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఆమె తన ఈవెంట్‌లో పోటీపడనుంది. 
 
దీక్షా, ఆమె తండ్రి కల్నల్ నరేన్ దాగర్, ఆమె తల్లి, ఆమె సోదరుడు పారిస్‌లోని ఇండియా హౌస్ నుండి ఆమె పారిస్ ఒలింపిక్ గేమ్స్ విలేజ్‌కు తిరిగి వస్తుండగా, వారి కారు మరొక కారును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదం నుంచి దీక్షా క్షేమంగా బయటపడింది. దీక్షా తన ప్రాక్టీస్ షెడ్యూల్‌కు హాజరు కావాలని ప్లాన్ చేస్తోంది. ఇంకా ఆమె తప్పకుండా మ్యాచ్ ఆడుతుందని ఆమె తండ్రి ధృవీకరించారు. మహిళల గోల్ఫ్ ఈవెంట్ ఆగస్టు 7న ప్రారంభమై ఆగస్టు 10న ముగుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు