సాకర్ ప్రపంచ కప్: స్పెయిన్ జట్టుకు మద్దతు తెలిపిన మహేష్ బాబు!
శుక్రవారం, 13 జూన్ 2014 (11:05 IST)
ప్రపంచ వ్యాప్తంగా సాకర్ ప్రపంచ కప్ ఫీవర్ పట్టుకుంది. ఇండియాలో కూడా ఫుట్‌బాల్ అభిమానులు చాలా మందే వున్నారు. మన సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఫుట్‌బాల్ అభిమానే. అయితే ఈ ప్రపంచ కప్‌లో స్పెయిన్ టైటిల్ సాధించే అవకాశాలున్నాయని మహేష్ చెప్పాడు.
డిగో మారడోనాను తన ఆల్‌టైమ్ ఫేవరేట్‌గా చెప్పిన మహేష్.. ఈ టోర్నీలో క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ గోల్స్ చేస్తాడని, అతనే ఈ తరంలో అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. బ్రెజిల్, స్పెయిన్‌ల మధ్య ఫైనల్ జరిగితే చూడాలని ఉందని.. 2010లో స్పెయిన్ ప్రపంచకప్ గెలవడం తాను ఎప్పటికీ మరిచిపోలేనని మహేష్ చెప్పాడు.