33 అంతస్తులను ఎక్కాలని తాను చేపట్టిన ఛాలెంజ్ విజయవంతమవుతుందని అనుకోలేదని, ఎక్కువ ఫ్లోర్‌లు ఎక్కుతున్న కొద్దీ తన భుజాలు, కాళ్ల కింద నొప్పి తీవ్రమైందని అరిలిన్ చెప్పుకొచ్చాడు. చివరి అంతస్తుకు చేరుకోగానే ఎలాంటి పొరపాట్లు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్లానని ఈ ఫీట్ సాధించడం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నాడు.