ప్రాణాలు కోల్పోయిన 18ఏళ్ల బాక్సర్.. ఫైట్ ముగిశాక..?
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (18:39 IST)
Boxer
18 ఏళ్ల మెక్సికన్ బాక్సర్ ప్రాణాలు కోల్పోయింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొన్న 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయి తీవ్ర గాయాలతో మృతి చెందింది. మాంట్రియల్‌లో జరిగిన జీవీఎం గాలా ఇంటర్నేషనల్ బౌట్‌లో ఈ ఘటన జరిగింది.
మెక్సికోకు చెందిన వెల్టర్‌వెయిట్ బాక్సర్ జెన్నెట్టా జకారియాస్ జపాటా ఆరు రౌండ్ల బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొన్నది. అయితే నాలుగవ రౌండ్‌లోనే ఆమె నాకౌట్ అయ్యింది.
ప్రత్యర్థి మారీ పెయిర్ విసిరిన పంచ్‌లకు ఆమె నేలకూలింది. తీవ్ర గాయాల కారణంగా అయిదో బౌట్ ఆడలేకపోయింది. మెదడులో గాయం ఏర్పడడం వల్ల ఆమె ప్రాణాలు విడిచినట్లు ఫైట్ నిర్వాహకులు తెలిపారు.