తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్ర ప్రభుత్వం టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇచ్చిన కోటి రూపాయలపై సేవా పన్ను చెల్లించలేదని ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన సమన్లకు సానియా సమాధానం ఇచ్చారు. తాను సేవా పన్ను ఎగవేయలేదని సానియా స్పష్టం చేశారు. ఈ మేరకు తన చార్టర్డ్ అకౌంటెంటు ద్వారా సానియా మీర్జా ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన సమస్లను సమాధానం ఇచ్చుకున్నారు.