స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. తాను టెన్నిస్ ఆడుతున్న మైదానంలో పాప కనిపించలేదనే అలజడి మొదలు కావడంతోనే మ్యాచ్ ఆపేశాడు. ఆ పాప తిరిగి తల్లిని చేరేదాక నాదల్ కోర్టులో అలానే నిల్చుండిపోయాడు. ఈ ఘటన మల్లోర్కాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, సహచర ఆటగాడు సిమోన్ సోల్బాస్‌ల జోడి మల్లోర్కాలో బుధవారం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది.
అయితే సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో చోటు చేసుకునే సందడిని ఆటగాళ్లు పట్టించుకోరు. కానీ రఫెల్ మ్యాచ్‌ను ఆపేశాడు. ఆ తల్లి పాపకోసం పడుతున్న బాధను తనకు జరిగిన నష్టంగా భావించిన నాదల్ స్టేడియం వైపే తన దృష్టిని కేంద్రీకరించాడు. పాప దొరికేదాకా మ్యాచ్‌ను ఆపేశాడు. తద్వారా మానవత్వం చాటుకున్నాడు.