జికా వైరస్ భయం భయం.. రియో అథ్లెట్ల కోసం కండోమ్‌లు!

మంగళవారం, 17 మే 2016 (14:59 IST)
ప్రపంచ దేశాల్లో జికా వైరస్ ప్రస్తుతం భయాందోళనలు సృష్టిస్తోంది. దోమల కారణంగా ఏర్పడే ఈ వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ క్రమంలో జికా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఆస్ట్రేలియా ప్రస్తుతం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బ్రెజిల్‌లోని రియోలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం రక్షణ కోసం కండోమ్‌లు అందజేయాలని నిర్ణయించింది. వీటిల్లో వైరస్‌ నిరోధక లూబ్రికెంట్స్‌ ఉంటాయి.
 
శృంగారం ద్వారా ప్యూర్టోరికో మహిళకు జికా వైరస్ సోకే అవకాశం ఉందని.. ఇప్పటికే ఇలా జికా వైరస్ సోకిన తొలి కేసు వివరాలను కూడా జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో.. ఆస్ట్రేలియా అప్రమత్తమైంది. జికా వైరస్ నుంచి రక్షణకు రియోలో పాల్గొనే క్రీడాకారులకు జికా వైరస్ నిరోధక లూబ్రికెంట్స్ ఉండే కండోమ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టార్‌ఫార్మా సహకారంతో వైరస్‌ నిరోధక ప్రత్యేక కండోమ్‌లను తయారు చేయించి సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ఒలింపిక్‌ మిషన్‌ చీఫ్‌ కిట్టీ చిల్లర్‌‌ చర్యలు మొదలెట్టారు.

వెబ్దునియా పై చదవండి