రెజ్లర్ - ప్రియుడితో ఒలింపిక్స్‌ విజేత సాక్షిమాలిక్‌ ఎంగేజ్మెంట్

సోమవారం, 17 అక్టోబరు 2016 (09:31 IST)
రియో ఒలింపిక్స్‌ పతక విజేత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌‌కు హర్యాణాలోని రొహ్‌తక్‌ నగరానికే చెందిన ప్రియుడు, రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియన్‌‌తో నిశ్చితార్థం జరిగింది. ఒలింపిక్ పతకం గెలిచిన అనంతరం తన ప్రేమ సంగతిని సాక్షి మాలిక్ వెల్లడించిన సంగతితెలిసిందే. 
 
ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం ఈ జంటకి నిశ్చితార్థమైంది. ఈ మేరకు తమ రెండు కుటుంబాలకు చెందిన సభ్యుల సమక్షంలో జరిగిన నిశ్చితార్థ వేడుక చాలా బాగా జరిగిందని సత్యవర్త్‌ తండ్రి సత్యవాన్‌ వెల్లడించారు. 
 
కాగా, 014లో గ్లాస్గో  జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం, ఇంచియాన్‌ ఆసియా క్రీడల్లో సత్యవర్త్‌ కాంస్యం గెలిచి సత్తాచాటాడు. భారీకాయుడైన సత్యవర్త్ 97 కేజీల విభాగంలో పోటీపడుతుంటాడు. వాస్తవానికి రియో ఒలింపిక్స్‌‌కు ముందే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ రియో ఒలింపిక్ క్రీడల కోసం దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా, 24 ఏళ్ల సాక్షి మాలిక్‌ కన్నా సత్యవర్త్‌ రెండేళ్లు చిన్నవాడు.

వెబ్దునియా పై చదవండి