టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, 121 ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రా కల నెరవేరింది. టోక్యో ఒలింపిక్స్ 2020కి తర్వాత స్వదేశం చేరిన తర్వాత వరుసగా సభలు, సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేశాడు. ఎట్టకేలకు కాసింత విశ్రాంతి సమయం దొరకడంతో తల్లిదండ్రులను తీసుకుని, విహార యాత్రకు బయలుదేరాడు.