రాష్ట్రస్థాయి హకీ విజేతగా విశాఖ బాలికల జట్టు

శనివారం, 21 నవంబరు 2015 (16:30 IST)
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల హాకీ టోర్నమెంట్‌లో విశాఖపట్టణం జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌ పోటీలో కడపపై విశాఖ జట్టుపై 3-0 గోల్స్‌ తేడాతో గెలిచింది. 

విశాఖపట్టణం జట్టులోని ఎం.భవాని, స్పందన అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ ఛైర్మన్‌ తిప్పయ్యస్వామి హాజరై విజేతలకు బహుమతులు అందించారు.

వెబ్దునియా పై చదవండి