తాను హంగేరీ నుంచి వచ్చానని, భారత్ నుంచి వచ్చే వారి నుంచి కరోనా సోకే అవకాశాలు ఉన్నాయన్నది వినేశ్ వాదన. వారితో కలిసి ప్రాక్టీసు కూడా చేయలేదట. మ్యాచ్‌లలో అధికారిక స్పాన్సర్ కిట్లను కూడా ధరించలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై ఆరోపణలు చేసింది. భారత్ తిరిగొచ్చిన వినేశ్ కు రెజ్లింగ్ సమాఖ్య నోటీసులు ఇచ్చింది. ఆమె పై తాత్కాలిక నిషేధం విధించింది. 16 లోగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.