ఆపిల్ ఖీర్

బుధవారం, 23 జులై 2008 (18:17 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
ఆపిల్స్... నాలుగు
పాలు... ఒక లీటరు
పంచదార... నాలుగు టీస్పూన్లు
యాలకులపొడి... పావు టీస్పూన్
బాదంపప్పులు... నాలుగు
పిస్తాపప్పులు... ఐదు

తయారీ విధానం :
ముందుగా పాలను వేడిచేసి, అందులో పంచదార వేసి పాలు సగం అయ్యేదాకా తక్కువ మంటమీద మరిగించాలి. తరువాత ఆపిల్ తురుమును వేసి బాగా కలియబెట్టాలి. బాగా ఉడికిన తరువాత స్టౌ మీదనుండి దించి యాలకుల పొడి కలిపాలి. తరువాత బాదం, పిస్తా పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో వేయాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుని బాగా చల్లారిన తరువాత తింటే... రుచి అద్భుతంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి