కావలసిన పదార్థాలు : కుంకుమ పువ్వు - నాలుగు గ్రాములు, పంచదార - 500 గ్రాములు, పాలు - నాలుగున్నర లీటర్లు, బాదం పప్పు - 75 గ్రాములు, ఏలకుల పొడి - మూడు చెంచాలు.
తయారు చేయు విధానం : ముందుగా పాలను చిక్కబడేంత వరకు కాచి దించి ఫ్యాను కింద ఆరబెట్టి కోవాను తయారు చేసుకోవాలి. ఇలా కాసేపు ఉంచిన తర్వాత కాస్త కోవాను తీసుకుని అందులో కుంకుమ పువ్వు, ఏలకుల పొడిలను వేసి గోరు వెచ్చని పాలను పోసి కాసేపు నాననివ్వాలి.
తర్వాత కోవాను తీసుకుని గుండ్రంగా రోల్స్లాగా తయారు చేసుకోవాలి. ఇందులో కుంకుపువ్వు వేసిన కోవా మిశ్రమాన్ని పెట్టాలి. కుంకుమ పువ్వు అందంగా కనిపించేలా చక్కగా రోల్ చేసి పైన బాదంతో డెకరేట్ చేయాలి.