కావలసిన వస్తువులు: చక్కెర: 700 గ్రాములు సెనగ పిండి: 100 గ్రాములు ముదురు కొబ్బరికాయ: ఒకటి జీడిపప్పు : 70 గ్రాములు కేసరిపొడి: తగినంత ఏలక్కాయ: 7 లేక 8 నెయ్యి: 150 లేదా 200 గ్రాములు
ఇవి సిద్ధం చేసుకోండి: కొబ్బరిని బాగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చిప్పని కోరకూడదు. జీడిపప్పుని బద్దలు చేసుకుని నెయ్యిలో వేయించి ప్రక్కన పెట్టుకోండి. 1/4 లీటరు నీళ్లలో చక్కెర కలిపి పొయ్యి మీద పెట్టి చిక్కగా చేసుకోవాలి.
ఇలా చెయ్యండి : ఈ చక్కెర పాకం మరుగుతూ ఉన్నప్పుడు కొబ్బరి ముక్కలు కలిపి, తిప్పుతూ వుండాలి. చిక్కబడుతూ ఉన్నప్పుడు సెనగపిండిని కొంచెం కొంచెంగా చేర్చి బాగా కలుపుతూ ఉండాలి. తరువాత వేయించిన జీడిపప్పు, కేసరిపొడి కలపాలి. అందులో రెండు లేక మూడు భాగాలుగా నెయ్యిని పొయ్యాలి. బాగా గరిటతో కలపాలి. ఇది పొంగుతున్నప్పుడు, ఏలక్కాయపొడి కలిపి దించేముందు నెయ్యి రాసిన పళ్ళెంలో పొయ్యాలి. అరటి ఆకుతో పైన అంతా సమానంగా చెయ్యాలి. చల్లారిన తర్వాత కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి.
గమనిక : ఇది మామూలు మైసూర్ పాక్లా అంత ఎక్కువగా పొంగదు, నురగరాదు. మరుగుతున్నప్పుడే వెంటనే పొయ్యిమీద నుంచి దించాలి.