కొబ్బరి బొబ్బట్లు

సోమవారం, 25 ఆగస్టు 2008 (19:04 IST)
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
కొబ్బరికాయ... ఒకటి
మైదాపిండి... 250 గ్రాములు
ఏలకులు... పది
బెల్లం... 150 గ్రాములు
నూనె... వంద గ్రాములు లేదా
నెయ్యి... వంద గ్రాములు

తయారీ విధానం :
కొబ్బరిని తురుముకుని బెల్లంతో కలుపుకోవాలి. శనగపప్పును బాగా ఉడకబెట్టుకుని కొబ్బరి, బెల్లం, ఏలక్కాయలతో కలిపి మిక్సీలో రుబ్బుకోవాలి. మైదాను తీసుకుని చపాతీ పిండిలాగా మెత్తగా తడుపుకోవాలి.

పిండిని నిమ్మకాయంత తీసుకుని... మెత్తగా రుబ్బుకున్న పూర్ణంను తగినంత అందులో ఉంచి మెల్లగా, పూర్ణం బయటకు రాకుండా రొట్టెలాగా చేసుకోవాలి. మొత్తం పిండినంతా అలా చేసుకుని బాగా కాలుతున్న పెనంపై వేసి, ఎర్రగా రెండువైపులా నూనె లేదా నెయ్యితో కాల్చుకుని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి