కావలసిన పదార్థాలు : పచ్చి పాలకోవా... 250 గ్రాములు యాలకులు... అరచెంచా జాఫ్రాన్ కలర్... చిటికెడు జీడిపప్పు... 30 గ్రాములు జాజికాయ... చిన్న ముక్క పంచదార... 300 గ్రాములు
తయారీ విధానం : ఓ మందపాటి గిన్నెలో పచ్చికోవా, పంచదారలను కలిపి సన్నని మంటమీద గరిటెతో కలుపుతూ మాడకుండా పాకం పట్టాలి. పాకం వచ్చిన తరువాత దానిని దించి గరిటెతో కలుపుతూ కోవాను చల్లార్చాలి. కొంచెం సేపటి తరువాత కోవా ముద్దలాగా తయారవుతుంది.
కాసింత కోవా ముద్దలో యాలకుల పొడి, జీడిపప్పు, జాఫ్రాన్ కలర్‌లు కలిపి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన కోవా నుండి మరికొంచెం కోవా ముద్దను తీసుకుని పలుచగా చేసి, దాని మధ్యలో కలర్ కలిపిన మిశ్రమాన్ని పెట్టి చిన్న రోల్‌లాగా చుడితే కోవా రోల్ రెడీ.