క్యారెట్ జామ్

గురువారం, 8 జనవరి 2009 (18:42 IST)
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
క్యారెట్లు... అరకేజీ
పంచదార... పావు కేజీ
సిట్రిక్ యాసిడ్... పావు టీస్పూన్

తయారీ విధానం :
ముందుగా క్యారెట్‌ పైపొరను తీసి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. వీటికి తగినంత నీరు పోసి ఉడికించాలి. తరువాత నీటిని ఓ పాత్రలోకి ఒంపేసి క్యారెట్‌ ముక్కలను మెత్తటి గుజ్జులాగా చేసుకోవాలి. పాత్రలో ఒంపి ఉంచుకున్న నీటికి పంచదార కలిపి చిక్కటి పాకంలా స్టవ్‌పై వేడిచేయాలి.

స్టవ్‌మీద ఉండగానే సిట్రిక్ యాసిడ్‌వేసి మరో ఐదు నిమిషాలపాటు పాకాన్ని మరగనివ్వాలి. చివర్లో మంట తగ్గించి క్యారెట్ గుజ్జు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే క్యారెట్ జామ్ రెడీ అయినట్లే...! రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే ఈ క్యారెట్ జామ్‌ను వేయించిన బ్రెడ్ పీసులతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి