ఖర్జూరం హల్వా

గురువారం, 8 జనవరి 2009 (18:31 IST)
ND
కావలసిన పదార్థాలు :
ఖర్జూరం పండ్లు... పావు కేజీ
పుచ్చకాయ విత్తనాలు... గుప్పెడు
చక్కెర... వంద గ్రాములు
నెయ్యి... 50 గ్రాములు
కోవా... 50 గ్రాములు
చెర్రీపండ్లు... 25 గ్రాములు

తయారీ విధానం :
పుచ్చకాయ నుంచి గింజలను ముందుగా తీసేయండి. తరువాత చాకుతో వాటిని సన్నటి ముక్కలుగా కోయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఖర్జూర పండ్ల ముక్కలను ఒక గిన్నెలో వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి స్టౌమీద పెట్టి ఉడికించండి.

తరువాత ఒక బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక, దాంట్లో ఉడికించిన ఖర్జూరం పండు ముద్దను వేసి ఫ్రై చేయాలి. దాంట్లోనే చక్కెర, కోవా కలిపిన మిశ్రమాన్ని వేసి మరికాస్తసేపు వేయించాలి. అలాగే సన్నటి మంటమీద ఆ పదార్థాన్ని ఉడికిస్తూ... హల్వా లాగా దగ్గరపడిన తరువాత బాణలిని కిందికి దించేయాలి.

తరువాత సర్వింగ్ డిష్‌లోకి పైన తయారు చేసిన హల్వాను మార్చి.. పైన పుచ్చకాయ గింజలు, చెర్రీ పండ్లను చల్లి అతిథులకు వడ్డించండి.

వెబ్దునియా పై చదవండి