గోధుమ హల్వా

గురువారం, 8 జనవరి 2009 (18:33 IST)
కావలసిన పదార్థాలు :
గోధుమలు... అరకేజీ
బెల్లం... పావుకేజీ
యాలకులు... నాలుగు
నెయ్యి... రెండు టీస్పూన్లు
జీడిపప్పు... కొద్దిగా

తయారీ విధానం :
ముందుగా గోధుమలను రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం రుబ్బి, పాలు తీసుకోవాలి. ఆ పాలను పలుచటి గుడ్డలో పోసి వడగట్టాలి. రెండు గంటల తర్వాత పాలగిన్నెలో నీరు పైకి తేరుతుంది. ఆ నీటిని ఒంచేసి... అడుగున వున్న చిక్కటి పాలను పొట్టు లేకుండా వడగట్టుకోవాలి.

ఇప్పుడు పై మిశ్రమంలో దంచిన బెల్లం, యాలకుల పొడి వేసి... పొయ్యి మీద పెట్టి గట్టి పడకుండా, చేతికి అంటకుండా వుండేంత దాకా కలుపుతూ ఉండాలి. చివరిగా దింపేముందు నెయ్యితో వేయించిన జీడిపప్పు ముక్కలను కలిపి... పళ్ళానికి నెయ్యి రాసి అందులోకి వేయాలి. ఈ పదార్థాన్ని ఓ గంటసేపు ఆరనిచ్చి నచ్చిన ఆకారాల్లో కోసుకోవాలి. అంతే గోధుమ హల్వా రెడీ అయినట్లే...!

వెబ్దునియా పై చదవండి