బియ్యపుపిండిలో ఆరు టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేసి చిటికెడు ఉప్పు కలపాలి. తరువాత పాలుకూడా పోసి అవసరమైతే కొద్దిగా తడిచేసుకుని చపాతీపిండిలా కలిపి గంటసేపు పక్కన ఉంచాలి. మొక్కజొన్న పిండిలో ఆరు టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి కలిపి పక్కన ఉంచాలి. పిండిముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనూ పలుచని చపాతీలా వత్తి దానిమీద మొక్కజొన్న పిండిని చల్లాలి. దాని మీద మరో చపాతీ పెట్టి ముందు చేసినట్లుగానే మొక్కజొన్నపిండిని చల్లాలి. దీనిమీద మరో చపాతీ పెట్టి మరోసారి మొక్కజొన్న పిండిని చల్లాలి.