కావలసిన పదార్థాలు : టమోటోలు... పావు కేజీ పంచదార... పావు కేజీ యాలక్కాయలు... మూడు జీడిపప్పులు... 50 గ్రాములు పచ్చి కొబ్బరికాయ... ఒకటి
తయారీ విధానం : టమోటోలను కుక్కర్‌లో పెట్టి, గ్లాసు నీరు పోసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ఉడికిన తరువాత టమోటోలను తీసుకుని వేడి చల్లారిన తరువాత మెత్తగా పిసికి వడబోయాలి.
కొబ్బరి కోరును, టమోటో రసంను, పంచదారను కలిపి ఒక గిన్నెలో పోసి స్టవ్‌పై పెట్టి కాగనివ్వాలి. అడుగంటకుండా తిప్పుతూ చిక్కబడేదాక ఉడికించాలి. చిక్కబడిన తరువాత నెయ్యి రాసి ఉంచిన పళ్లెంలోకి వంచుకుని సమానంగా చేసుకుని... పైన జీడిపప్పు... యాలక్కాయల పొడిని చల్లుకోవాలి. అంతే టమోటో స్వీట్ సిద్ధమైనట్లే...! ఓ పట్టు పడదామా...!!