కావలసిన పదార్థాలు : జీడిపప్పు... పావుకేజీ పంచదార పొడి... 300 గ్రాములు లిక్విడ్ ఫుడ్‌కలర్ (ఆకుపచ్చ లేదా నారింజ)... ఒక గ్రాము లవంగాలు... సరిపడా నెయ్యి... 50 గ్రాములు
తయారీ విధానం : జీడిపప్పును రెండు గంటలపాటు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా ముద్దగా అయ్యేదాకా రుబ్బుకోవాలి. ఓ బాణలిలో నెయ్యి వేసి అందులో రుబ్బుకున్న జీడిపప్పు ముద్దను వేసి సన్నటి మంటమీద కొంచెం దగ్గర పడేదాకా ఉడికించి దించేయాలి.
తరువాత లిక్విడ్ ఫుడ్ కలర్, పంచదార పొడి అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టి యాపిల్, జామ, జీడిపండ్ల ఆకారంలో చేసుకోవాలి. చివరగా ఇష్టమైన రంగును బ్రష్‌తో అద్ది లవంగాలు గుచ్చితే తియ్య తియ్యటి జీడిపండ్లు సిద్ధమైనట్లే...!