పాలతో రసగుల్లా

మంగళవారం, 22 జులై 2008 (17:59 IST)
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటరు
డాల్డా... 200 గ్రాములు
పంచదార... 400 గ్రాములు
యాలకులు... నాలుగు

తయారీ విధానం :
ముందుగా పాలలో కాస్తంత మజ్జిగ చుక్క వేసి స్టవ్‌పై పెట్టి వేడి చేస్తే విరిగిపోతాయి. తరువాత విరిగిన పాలని మళ్ళీ స్టవ్‌మీద పెట్టి సన్నని మంటమీద పెడితే అందులోని నీరంతా ఆవిరైపోయి, మిగతాది పొడిపొడిగా తయారవుతుంది.

పొడిగా అయిన పదార్థాన్ని తడి చేతితో బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత బాణలిలో డాల్డాపోసి మరిగిన తరువాత ఈ ఉండలను వేసి వేగనివ్వాలి. వేగుతుండగా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఉండలన్నీ వేగిన తరువాత అప్పటికే తయారు చేసుకుని ఉన్న పంచదార పాకంలో వేయాలి. ఆ తరువాత యాలకులపొడిని అందులో చల్లి ఓ గంటసేపు నానబెడితే పాలతో రసగుల్లా తయారయినట్లే. మీరు కూడా ప్రయత్నిస్తారు కదూ...!

వెబ్దునియా పై చదవండి