కావలసిన వస్తువులు : బియ్యం: 100 గ్రాములు చక్కెర: 200 గ్రాములు కొబ్బరి : అర్థ భాగం ఏలకలు : 5 జీడిపప్పు : 5 లేక 6 పసుపు అరటిపళ్లు : 2
ఇలా చేయండి : బియ్యం బాగా శుభ్రం చేసి గంటపాటు నీళ్ళలో నానబెట్టాలి. నానిన బియ్యంలో కొబ్బరి తురుమును చేర్చి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంటలో ఉడికిస్తూ కలుపుతూ ఉండాలి. మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర, కొబ్బరి తురుమును చేర్చి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత రెండు పసుపు అరటి పళ్ల ముక్కలను ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. 3 నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని దించి పక్కన పెట్టుకోండి. చివరిగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఏలకుల పొడిని కలపండి. బనానా పాయసం రెడీ...