కావలసిన పదార్థాలు : బియ్యం... పావుకేజీ బెల్లం... 200 గ్రాములు పాలు... పావు లీటరు యాలకులు... 5 జీడిపప్పు... 10 పలుకులు ఎండుకొబ్బరి... సగం చిప్ప నెయ్యి... రెండు టీస్పూన్లు
తయారీ విధానం : ఈ పరమాన్నం తయారీలో కొత్త బియ్యం అయితే బాగుంటాయి. పావుకేజీ బియ్యాన్ని శుభ్రపరచుకొని, సరిపడా నీళ్ళుపోసి పొయ్యిమీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఎండుకొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటినీ, జీడిపప్పునూ నేతిలో వేయించుకోవాలి. తెల్లటి బెల్లాన్ని పొడిగా చేసి ఉడికే అన్నంలో వేసి బాగా కలపాలి.