కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం : ఐదు టేబుల్ స్పూన్లు పాలు : 1/2 లీటరు యాలకుల పొడి : ఒక టీస్పూన్ కుంకుమపువ్వు : చిటికెడు చక్కెర : 100 గ్రాములు నెయ్యి : 2 టీస్పూన్లు జీడిపప్పు : 10 గిజలు కిస్మిస్ : 10 గిజలు బాదాం పిస్తా : 10 గిజలు
తయాలీ విధానం : మొదట బియ్యం శుభ్రం చేసుకుని కడిగి బరకగా పొడి చేసికోవాలి. ఈ తడి బియ్యం పిండిని పాలల్లో వేసి ఉడికించాలి. చిక్కబడ్డాక చక్కెర వేసి కాస్త గట్టిపడేవరకు ఉంచుకోవాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు, యాలకులు, బాదాం పిస్తా గింజలను కలపాలి. ఇది వేడిగా కాని చల్లగా కాని బావుంటుంది.