కావలసిన పదార్థాలు : బీట్‌రూట్... అరకిలో పంచదార... పావు కిలో నెయ్యి... సరిపడా జీడిపప్పు... సరిపడా కిస్‌మిస్... సరిపడా యాలకులు... 5 కాయలు
తయారీ విధానం : తాజాగా ఉన్న బీట్‌రూట్‌లను తీసుకొని కడిగి ఒక గిన్నెలో వేసి రెండు గ్లాసుల నీరు పోసి 15 నిమిషాల సేపు ఉడికించాలి. ఉడికిన గడ్డలను చాకుతో చెక్కు తీసి ఎండు కొబ్బరికోరుతో కోరుకోవాలి. కోరుకున్న దాంట్లో పావుకేజీ పంచదార పోసి పొయ్యిమీద పెట్టి నెయ్యివేస్తూ... సన్నని సెగమీద తిప్పుతూ ఉండాలి.
హల్వా దగ్గర పడుతుండగా జీడిపప్పు, కిస్‌మిస్, కొద్దిగా నెయ్యిలో వేయించి హల్వాలో వేయాలి. యాలకుల పొడి కూడా అందులో వేసి ఒక పళ్ళానికి నెయ్యిరాసి దాంట్లో పోయాలి. ఆరకుండానే ముక్కలుగా కోసుకోవాలి. మంచి రక్త పుష్టిని కలిగించే ఈ హల్వాకు పంచదార కూడా తక్కువ పడుతుంది.